

కంప్యూటెక్స్ 2026 సదస్సులో ఎన్‌విడియా పలు కీలక ప్రకటనలు చేసింది. ఇందులో ప్రధానంగా RTX Spark PC చిప్‌ను ఆవిష్కరించింది. ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఈ చిప్‌ను ‘ఏఐ యుగానికి అనుగుణంగా పర్సనల్ కంప్యూటర్‌ను పునర్నిర్మించే సాంకేతికత’గా అభివర్ణించారు. మైక్రోసాఫ్ట్, మీడియాటెక్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ చిప్ ద్వారా క్లౌడ్‌పై ఆధారపడకుండా ఏఐ ఏజెంట్లు, భారీ ఏఐ మోడళ్లు నేరుగా ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లలోనే పనిచేయగలవు. ఈ ఏడాది చివర్లో ఆసుస్, డెల్, హెచ్‌పీ, లెనోవో, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్, ఎంఎస్‌ఐ వంటి సంస్థల పీసీల్లో ఈ చిప్ అందుబాటులోకి రానుంది.
RTX Sparkతో పాటు Vera CPU, DGX Station AI సూపర్ కంప్యూటర్, ఓపెన్ సోర్స్ AI ఏజెంట్ టూల్స్, Cosmos 3 ఫౌండేషన్ మోడల్, Alpamayo 2 Super రీజనింగ్ మోడల్‌లను కూడా ఎన్‌విడియా ప్రకటించింది. రోబోటిక్స్, స్వయంచాలక వాహనాలు, డేటా ప్రాసెసింగ్, ఎంటర్‌ప్రైజ్ AI రంగాల్లో ఈ సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయని సంస్థ తెలిపింది. అధునాతన గేమింగ్, క్రియేటివ్ వర్క్‌ఫ్లోలు, భారీ భాషా మోడళ్ల వినియోగానికి కూడా ఈ ప్లాట్‌ఫారమ్ మద్దతు ఇవ్వనుంది. AI ఆధారిత కంప్యూటింగ్ భవిష్యత్తును నిర్దేశించే దిశగా ఎన్‌విడియా మరో కీలక అడుగు వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!