
సినిమాలు

అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో UPS కార్గో విమానం (UPS 2976) టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. ప్రమాదంతో విమానం భారీగా పేలిపోయి చుట్టుపక్కల ప్రాంతంలో మంటలు, పొగలు వ్యాపించాయి.
స్థానిక నివాస భవనాలు కూడా మంటల్లో చిక్కుకుని తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఆ విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే వారిలో ఎవరు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఫ్లైట్ హవాయ్‌లోని హొనొలులుకు వెళ్తుండగా మధ్యలోనే ఈ భయానక ఘటన జరిగింది. ఘటనాస్థలికి అత్యవసర సేవా బృందాలు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దర్యాప్తు అధికారులు ప్రమాద కారణాలపై విచారణ ప్రారంభించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!