

రాజకీయ నాయకుల జాతకాలపై అంచనాలు చెప్పి గతంలో పలుమార్లు వివాదాలకు కేంద్రబిందువైన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానేసి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టిన ఆయన, తాజాగా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేయడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.
వేణుస్వామి పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య వీణ శ్రీవాణి భర్తకు రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం. షోరూమ్‌లో ఇద్దరూ కలిసి కారును కొనుగోలు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ కారును ఆయన కొనుగోలు చేయగా, దీని విలువ సుమారు కోటిన్నర రూపాయలకుపైగా ఉంటుందని తెలుస్తోంది. కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తుండగా, అభిమానులు మాత్రం వేణుస్వామి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ మద్దతుగా నిలుస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!