

అశ్వగంధ ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది. ఒత్తిడి తగ్గించడం, కండరాల బలం పెంచడం, గాఢ నిద్రకు సహాయపడడం వంటి అనేక ప్రయోజనాల కారణంగా దీనిని “ఇండియన్ జిన్సెంగ్”గా కూడా పిలుస్తారు. అయితే ఇటీవల భారత ఆహార భద్రత, ప్రమాణాల అధికారి (FSSAI) మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. అశ్వగంధ మొక్కలోని ఆకుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం భద్రతా అంశాలేనని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఆయుర్వేద గ్రంథాలలో అశ్వగంధ వేరును మాత్రమే ఔషధంగా సూచిస్తారు. కానీ కొన్ని సప్లిమెంట్ కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు ఆకులను కూడా వినియోగించడం ప్రారంభించాయి. పరిశోధనల ప్రకారం అశ్వగంధ ఆకుల్లో విథాఫెరిన్-ఎ అనే సమ్మేళనం అధికంగా ఉండి, అధిక మోతాదులో తీసుకుంటే కాలేయానికి హాని కలిగే ప్రమాదం ఉంది. అలాగే జీర్ణ సమస్యలు, నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చని గుర్తించారు. అయితే అశ్వగంధ వేరుపై ఎలాంటి నిషేధం లేదు, అది సరైన మోతాదులో సురక్షితమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలతో వినియోగదారులకు స్పష్టత లభించడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకునే అవకాశం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!