
టెక్నాలజీ

హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు, మూడు రోజుల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 10 వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని తెలిపింది. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!