
క్రీడలు

హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తిరిగి ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ డిమాండ్లను అంగీకరించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యల పై ఇరాన్ సైనిక ఉన్నతాధికారి జనరల్ అలీ అబ్దుల్లాహి ప్రతిస్పందిస్తూ, బెదిరింపులతో మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అవసరమైతే పశ్చిమాసియాలోని అన్ని అమెరికా సైనిక స్థావరాలు, అలాగే ఇజ్రాయెల్‌కు చెందిన కీలక మౌలిక సదుపాయాల పై వినాశకరమైన మరియు నిరంతర దాడులు చేపడతామని తెలిపారు.
ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!