
న్యూస్

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈసారి కూడా టెట్ అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పులు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. నిరుద్యోగులు, ఇన్‌సర్వీస్ టీచర్లకు ఒకే విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలతో ఇన్ఫర్మేషన్ బులిటెన్ ఈ నెల 15న విడుదల కానుంది.
ఫీజు చెల్లింపులో స్వల్ప మార్పులు చేశారు. జనరల్, బీసీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950గా ఫీజు ఖరారు చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!