

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న “జైలర్ 2” సినిమాలో ప్రత్యేక క్యామియో పాత్ర కోసం పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇంతకుముందు ఈ క్యామియో కోసం షారుఖ్ ఖాన్, నందమూరి బాలకృష్ణ పేర్లు కూడా వినిపించాయి కానీ డేట్స్ సమస్యల కారణంగా వారు తప్పుకున్నారని సమాచారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను మేకర్స్ సంప్రదించారని, ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్న పవన్ ఈ ప్రాజెక్ట్‌కు సమయం కేటాయిస్తారా అన్నది అనుమానంగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!