
న్యూస్

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 39.8 శాతం ఓట్లతో ముందంజలో నిలిచింది. బీఆర్ఎస్కు 28.7 శాతం ఓట్లు లభించగా, బీజేపీ 15.6 శాతం ఓట్లను సాధించింది.

ఇతర పార్టీలలో ఎంఐఎం 3.2 శాతం, ఏఐఎఫ్బీ 1.5 శాతం, సీపీఐ 1.3 శాతం, సీపీఎం 0.5 శాతం ఓట్లు పొందినట్లు ఈసీ వెల్లడించింది. ఈ గణాంకాలు రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల రాజకీయ సమీకరణాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!