

సోమవారం ఉదయం జమ్ము–కశ్మీర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.8 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ రోజు ఉదయం సుమారు 5:35 గంటల సమయంలో శ్రీనగర్‌కు దక్షిణ–పశ్చిమంగా 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్గాం జిల్లా సోయిబుగ్ ప్రాంతం సమీపంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
భూకంప ప్రభావంతో శ్రీనగర్, చారార్-ఇ-శరీఫ్, పుల్వామా, షోపియాన్, బారాముల్లా తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా నేల కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరిన్ని ప్రకంపనలు వస్తాయేమోనన్న ఆందోళనతో కొంతసేపు రోడ్లపైనే ఉండిపోయారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు స్పష్టం చేశారు. భూకంపాలకు అధిక అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కశ్మీర్ వాసులకు సూచించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!