
న్యూస్

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ్టి నుంచి డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి వచ్చింది. ఎమ్మెల్యేల హాజరును ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా నమోదు చేయనున్నారు. సభలో సభ్యుల హాజరును ఖచ్చితంగా నమోదు చేయడానికి ఈ ఆధునిక విధానాన్ని ప్రవేశపెట్టారు.
సభకు వచ్చి లోపల కూర్చున్న తర్వాతే హాజరు నమోదు అవుతుందని అధికారులు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ ఈ కొత్త విధానాన్ని అధికారికంగా ప్రారంభించగా, ఇకపై రిజిస్టర్లో సంతకం చేసే పద్ధతి ఉండదని అసెంబ్లీ సెక్రటరీ ఎమ్మెల్యేలకు తెలియజేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!