
గాసిప్స్

ఇండిగోలో ఇటీవల ఏర్పడిన కార్యకలాపాల సంక్షోభం పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు వేగం పెంచింది. ఈ పరిశీలనలో భాగంగా పర్యవేక్షణ వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
ముఖ్యంగా విమానాల భద్రత, రోజువారీ కార్యకలాపాలను పరిశీలించే నలుగురు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లు తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ కారణంగా వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు సమాచారం. పర్యవేక్షణ లోపాలు సకాలంలో పట్టు పడకపోవడంతోనే సంక్షోభం ఎంతగానో తీవ్రతరమైందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు మరిన్ని పరిపాలనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!