
టెక్నాలజీ

పిఠాపురంలో పక్షి ఈక పడినా ఏదో పెద్ద విషయం జరిగిందన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదని వ్యాఖ్యానించారు. తాను దేశం కోసం పని చేసే వ్యక్తినని, పండగలు, పబ్బాలకు రాలేదని తనపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
ఏదైనా కూలగొట్టడం, చెడగొట్టడం తేలిక కానీ కూటమిని ఏర్పాటు చేయడం కష్టమని, దాన్ని చెడగొట్టడం మాత్రం చాలా తేలికని పవన్ కళ్యాణ్ అన్నారు. స్కూల్లో ఇద్దరు పిల్లలు గొడవపడితే కులాల విషయాన్ని తెస్తారని, కానీ బాబాయ్ హత్య వంటి ఘటనలు మాత్రం వార్తలుగా మారడం లేదని విమర్శించారు. చెడు వార్తలకు మీడియానే బలం ఇస్తోందని, తనను తిట్టే వార్తలను వారే వైరల్ చేస్తున్నారని పేర్కొంటూ, తాను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.
_1771477764226.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!