
ఆరోగ్యం

ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం మొత్తం దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయింది. ఉదయం వేళల్లో విజిబులిటీ భారీగా తగ్గిపోవడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై వాహనాలు నెమ్మదిగా సాగాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పొగమంచు ప్రభావంతో విమాన, రైల్వే రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా చేరుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!