
గాసిప్స్

పెట్రోల్, డీజిల్ కార్ల యజమానులకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. పాత కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఈ పథకం కింద తొలి 10 వేల వాహనాలకు ఒక్కొక్కదానికి రూ.50 వేల వరకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించనుంది. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పథకానికి సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ 2.0ను ఢిల్లీ ప్రభుత్వం సిద్ధం చేసింది. త్వరలో జరిగే ఢిల్లీ కేబినెట్ సమావేశంలో ఈ పాలసీపై చర్చించి ఆమోదం పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆమోదం లభించిన వెంటనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!