
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఈ అలర్ట్ జారీ చేశారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగుల నుంచి రక్షణ కోసం సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారాలు సూచించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!