

బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ రాముడిగా, సౌత్ స్టార్ సాయి పల్లవి సీతగా నటిస్తున్న రామాయణ మూవీ అత్యంత అంచనాల మధ్య రూపొందుతుంది. బ్లాక్బస్టర్ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్ ఇటీవల విడుదలయ్యాయి. కొంత మంది నెటిజన్లు ఈ చిత్రంలోని వీఎఫ్ఎక్స్ పై విమర్శలు చేశారు. దీనికి సంబంధించి హృతిక్ రోషన్ స్పందిస్తూ, “కల్కి 2898 AD, బాహుబలి, రామాయణ, కోయి మిల్ గయా, క్రిష్ వంటి సినిమాల దర్శకులు నా హీరోలు. ఇప్పటివరకు ఎక్కడా చూడని అద్భుతమైన సినిమాలు రూపొందించే ధైర్యం, దార్శనికత వారిలో ఉంది. కాబట్టి వారిపై మనం గౌరవం చూపాలి” అని తెలిపారు.
దంగల్ సినిమాతో హిట్ కొట్టిన నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడు మరియు పరశురాముడు పాత్రల్లో, సాయి పల్లవి సీతా దేవిగా, యశ్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా చిత్రబృందం రాముడి లుక్ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేసింది. అయితే, కొంత మంది నెటిజన్లు 4000 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ నాణ్యతను ప్రశ్నిస్తూ, ఇతర సినిమాలతో పోల్చి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!