
క్రీడలు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ స్వాప్నిల్ దినకర్ కీలక ప్రకటన చేస్తూ, డయేరియా లక్షణాలతో ఇప్పటివరకు 64 మంది ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. వాటర్ మరియు డ్రైనేజి పైప్లైన్లలో లీకులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇంకా 39 మంది స్వల్ప లక్షణాలతో ఇళ్లలోనే ఉండగా వారికి వైద్య సహాయం అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. నీటి కలుషితంపై ఇప్పటికీ స్పష్టత లేదని, వాటర్ శ్యాంపిల్స్‌ను పరీక్షలకు పంపినట్లు చెప్పారు. పరీక్షా ఫలితాలు రావాల్సి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!