
టెక్నాలజీ

సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజపై జూబ్లీహిల్స్ పోలీసులు పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బెదిరింపులు, డబ్బు వసూలు, కిడ్నాప్, అక్రమ నిర్బంధం, మహిళపై అసభ్య ప్రవర్తన వంటి ఆరోపణలతో ఈ కేసులు నమోదు అయ్యాయి.
ఫిర్యాదు ప్రకారం, గత ఏడాది లో క్రెడిట్ కార్డు దరఖాస్తుల సమయంలో అమితోవ్ తేజకు ప్రణీత్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తరువాత అమితోవ్ తేజ, ప్రణీత్, అతని భార్య కలిసి షేర్ మార్కెట్లో అకౌంట్ తెరిచి ట్రేడింగ్ ప్రారంభించారు. అయితే ట్రేడింగ్‌లో రూ.11 లక్షల నష్టం రావడంతో డబ్బుల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
గత ఏడాది మే 4 న ప్రణీత్‌ను అక్రమంగా నిర్బంధించి, ఖాళీ పేపర్లు, చెక్కులు, ఆస్తి పత్రాలపై సంతకాలు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!