

కన్నడ సినీ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన (రమ్య) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. ఇటీవల సుప్రీం కోర్టు “వీధి కుక్కలు ఎప్పుడెప్పుడు చెడు మూడ్‌లో ఉంటాయో, ఎప్పుడు కరుస్తాయో తెలియదు, కాబట్టి వాటిని షెల్టర్ హోమ్స్‌కు తరలించాలి” అని సూచించిన నేపథ్యంలో రమ్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సర్కాస్టిక్‌గా పేర్కొన్నారు: “కుక్క మనసు చదవలేకపోతే మగవాడి మనసు కూడా చదవలేం. ఎప్పుడు రేప్ చేస్తాడో, హత్య చేస్తాడో తెలియదు… అలాంటి పరిస్థితిలో అందరు మగవాళ్లను జైల్లో పెట్టాలా?”
రమ్య సుప్రీంకోర్టు తర్కాన్ని ప్రశ్నించాలనుకున్నారు, కానీ కొన్ని నెటిజన్లు మగవాళ్లను కుక్కలతో పోల్చినట్లు వ్యాఖ్యానించారని తీవ్రంగా విమర్శించారు. మరోవైపు, ఇది కేవలం విమర్శ మాత్రమేనని, జంతు ప్రేమికురాలిగా వీధి కుక్కలను తరలించడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!