
గాసిప్స్

తెలంగాణలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించనుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సూచించాయి.
కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని, కొన్ని కార్పొరేషన్లలో అధికార నిర్ణయంలో ఎంఐఎం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంచనా వెల్లడించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!