

కోవిడ్ టీకా తీసుకున్న అనంతరం తీవ్రమైన అనారోగ్యానికి గురైన లేదా ప్రాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితులు లేదా వారి కుటుంబాలు ఎవరి తప్పు లేదా నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగిందని నిరూపించాల్సిన అవసరం లేకుండా పరిహారం అందించే విధంగా ‘నో ఫాల్ట్ కంపన్సేషన్’ విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ విధానం ద్వారా టీకా ప్రభావంతో నష్టపోయిన వారికి త్వరగా న్యాయం అందే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది.
టీకాల దుష్ప్రభావాల కారణంగా నష్టపోయిన కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తే, కోవిడ్ టీకా ప్రభావంతో బాధపడిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సులభంగా నష్టపరిహారం అందే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!