
రాజకీయాలు

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. “మా వాహనాన్నే ఆపుతారా?” అంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టోల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం ఆయన అనుచరులతో కలిసి హైవే టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనలో మహిళా సిబ్బందిపై కూడా దాడి జరిగిందని, మహిళలని చూడకుండా జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. టోల్ ప్లాజా మేనేజర్ రవిపై కూడా దాడి చేసి, బలవంతంగా కారులో తీసుకెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!