

సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామాల్లో సందడి కనిపిస్తున్నప్పటికీ, సంప్రదాయం పేరుతో జరుగుతున్న కోడి పందేలు, గుండాటలు అనేక కుటుంబాల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. పండుగను ఆనందంగా గడపాల్సిన సమయంలో కొందరు నిర్వాహకులు దీనిని వ్యాపారంగా మార్చి కోట్ల రూపాయలు సంపాదిస్తుండగా, సామాన్యులు తమ కష్టార్జితాన్ని కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
జిల్లాలో పండుగ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జూదాల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఒకసారి జూదంలోకి దిగితే బయటపడలేక లక్షల రూపాయలు నష్టపోయిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అప్పులు పెరగడం, ఆస్తులు అమ్ముకోవడం వంటివి కుటుంబ కలహాలకు దారి తీస్తున్నాయి. చిరుద్యోగి నుంచి మధ్యతరగతి వ్యక్తుల వరకు ఈ దుష్పరిణామాలకు గురవుతున్నారు.
బరిలో కోడులు రక్తమోడుతూ కుప్పకూలుతుండగా, క్షణాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఓడినవారు అప్పుల్లో కూరుకుపోతే, గెలిచినవారు ఆడంబర ఖర్చుల్లో మునిగిపోతున్నారు. చివరికి లాభపడేది నిర్వాహకులే కాగా, విజేతలు మరియు పరాజితులు ఇద్దరూ బాధితులేనని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!