

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలకు ఎప్పుడూ స్వాగతం ఉంటుందని చెప్పారు. కవిత కొత్త పార్టీ పెట్టినందుకు ఆయన అభినందనలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య హక్కులో భాగమని ఆయన పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ పాలనపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2014 నుంచి 2023 వరకు జరిగిన పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలు, దోపిడీని ప్రజలు మరచిపోవద్దని ఆయన అన్నారు. ఆ వ్యవస్థలో కవిత కూడా భాగస్వామి అని, ఇప్పటికీ ఆమె ఆ విషయాలపై సరైన వివరణ ఇవ్వలేదని చెప్పారు. మహిళ సాధికారతపై కవిత చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కేంద్రంగా ప్రజా పాలన చేస్తోందని, ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగుతోందని ఆయన తెలిపారు. ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అజారుద్దీన్, కోదండరామ్‌లకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై కూడా ఆయన విమర్శలు చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!