

పెద్ది సినిమా జూన్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం జూన్ 25 విడుదల తేదీపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే సినిమా పనుల్లో ఇంకా కొన్ని కీలక దశలు పూర్తి కావాల్సి ఉంది. ఐటమ్ సాంగ్ షూట్ ఇంకా మిగిలి ఉండగా, రెండో భాగానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను A. R. రెహమాన్ ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. సినిమా ఎడిటింగ్ పూర్తైన తర్వాతే ఆయన పనులు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ముందస్తుగా ఎలాంటి ప్రమోషన్ పోస్టర్లు విడుదల చేయవద్దని టీమ్‌కు సూచించినట్లు సమాచారం. విడుదలలో మార్పులు జరిగితే ముందస్తు ప్రమోషన్లు ప్రభావం కోల్పోతాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బుచ్చి బాబు సనా షెడ్యూల్ ప్రకారం సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాతో హిందీ మార్కెట్లో కూడా బలమైన ప్రభావం చూపించాలనే లక్ష్యంతో టీమ్ ముందుకు సాగుతోంది.












.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!