
న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్‌నగర్ జిల్లా లో పర్యటించనున్నారు. జిల్లాలోని చిట్టిబోయినపల్లిలో ప్రతిష్ఠాత్మక ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం జిల్లాకు విద్యాపరంగా కీలక మైలురాయిగా మారనుందని ప్రభుత్వం పేర్కొంది.
ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు ద్వారా మహబూబ్‌నగర్ ప్రాంతంలో ఉన్నత సాంకేతిక విద్యకు కొత్త ఊపొస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా స్థానిక యువతకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందుబాటులోకి రానుందని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో పాటు ఉపాధి అవకాశాలు, ప్రాంత అభివృద్ధికి కూడా ఇది దోహదపడనుందని భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!