
టెక్నాలజీ

హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల బృందం తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని తమ కళాశాలకు ఆహ్వానించింది. అత్యంత రద్దీగా గడిచిన రోజులో అన్ని సమావేశాలు, కార్యక్రమాలు ముగిసిన అనంతరం కూడా ముఖ్యమంత్రి విద్యార్థుల ఆహ్వానాన్ని స్వీకరించి వారితో ముఖాముఖి సంభాషించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల కెరీర్ లక్ష్యాలు, ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పొందిన సీఎం రేవంత్ రెడ్డి, వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ తన విజయ మంత్రాన్ని వివరించారు. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలోని ముఖ్యాంశాలను వివరిస్తూ, తమ నెట్‌వర్క్‌లు మరియు ప్రతిభను వినియోగించి భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులను కోరారు. హైదరాబాద్, తెలంగాణ బలాలు మరియు అవకాశాలను ప్రపంచానికి చాటే బ్రాండ్ అంబాసిడర్లుగా వారు ముందుకు రావాలని ఆహ్వానించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!