

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేపు ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ ప్రభావ సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రాన్ని సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ సమావేశానికి హాజరవుతున్న ఆయన, వివిధ దేశాలు మరియు పరిశ్రమల ప్రముఖులతో భేటీ కానున్నారు. సదస్సులో ఆర్థిక వృద్ధికి ఏఐ పాత్రపై జరిగే ప్రధాన సమావేశంలో ఇతర రాష్ట్రాల నాయకులు, కేంద్ర ప్రతినిధులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు.
రాష్ట్రంలో ఏఐ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి విస్తరణకు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ముఖ్యంగా యువతకు ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ అందించేందుకు ప్రముఖ సాంకేతిక సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయనున్నారు. కృత్రిమ మేధస్సు, క్వాంటం సాంకేతికత, సైబర్ భద్రత వంటి రంగాల్లో లక్షలాది మంది యువతకు నైపుణ్యాలు అందించే కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిధి బృందాలతో సమావేశాలు నిర్వహించి పెట్టుబడులు, సాంకేతిక సహకారం, పరిశోధన కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిశ్రమల అభివృద్ధికి దారితీయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!