

అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడిగా ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు ఆయన అభిమానులతో ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. తన నివాసంలోని పూజా మందిరంలో చోటుచేసుకున్న ఒక అపూర్వ దృశ్యాన్ని ఈ వీడియోలో చూపించారు. “ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుడిని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని మీతో పంచుకుంటున్నాను” అని ఆయన ఈ వీడియోను షేర్ చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా తన పూజా మందిరంలో జరిగిన ఒక విశేషాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోను రూపొందించినట్లు చిరంజీవి తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి తమ పూజా మందిరంలోని హనుమంతుడిని స్పృశిస్తూ ప్రసరించడం తనకు ఎంతో ప్రత్యేక అనుభూతినిస్తుందని చెప్పారు. ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకాంతి పడి మెరిసిన అద్భుతాన్ని చూశామని గుర్తుచేశారు. అలాగే కోణార్క్, అరసవల్లి దేవాలయాల్లో కూడా సూర్యకిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. అలాంటి దైవానుభూతి తన ఇంట్లో కూడా ఆంజనేయుడిని స్పృశించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. చివరగా, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.












.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!