

కొత్త ఆర్థిక సంవత్సరం 2026 - 27 బుధవారం నుంచి ప్రారంభం కావడంతో బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలతో పాటు పలు బ్యాంకులు ఖాతాదారుల లావాదేవీలపై కొత్త నిబంధనలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఏటీఎం వినియోగంపై పరిమితులు, యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణలపై కొత్త ఛార్జీలు విధించడం వంటి నిర్ణయాలు తీసుకున్నాయి.
ఇకపై ఏటీఎంలలో యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణలను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల్లోనే పరిగణిస్తారు. ఉచిత పరిమితి పూర్తయిన తర్వాత ప్రతి లావాదేవీపై ₹23 తో పాటు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని ₹1,00,000 నుంచి ₹50,000 కు తగ్గించింది. అలాగే డిజిటల్ చెల్లింపుల భద్రత కోసం రెండంచెల ధృవీకరణను తప్పనిసరి చేశారు. ఈ మార్పులతో వినియోగదారులు మరింత జాగ్రత్తగా లావాదేవీలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.






%2C_Shri_Hardeep_Singh_Puri_addressing_a_press_conference_on_Swachh_Survekshan_2018%2C_in_New_Delhi_on_May_16%2C_2018.jpg&w=3840&q=75)
.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!