

అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ కెనెడీ స్కూల్ (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్)లో నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) హాజరయ్యారు. తొలి రోజు పరిచయ కార్యక్రమాలతో పాటు “21వ శతాబ్దంలో నాయకత్వం” కోర్సులో భాగంగా “అధికార విశ్లేషణ – నాయకత్వం” అంశంపై తొలి సెషన్ ప్రారంభమైంది.
సోమవారం ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. కేస్ అనాలిసిస్, వివిధ అంశాలపై చర్చలు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొన్నారు. తరగతులు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా బోస్టన్ ప్రాంతమంతా తీవ్ర శీతాకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటోంది. “ఫెర్న్” అనే భారీ మంచు తుఫాను కారణంగా సుమారు 24 ఇంచులకుపైగా మంచు కురిసినట్లు సమాచారం. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌కు దిగువకు పడిపోయాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!