

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ ఘనపూర్ మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సోలిపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి సింధు, బీఆర్ఎస్ అభ్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.
అధికారులు రీకౌంటింగ్ చేసినా ఫలితం మారకపోవడంతో, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కొనసాగించారు. ఈ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత పరిస్థితి నియంత్రణలో లేకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
పోలీసుల చర్యపై ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వెంటనే అదనపు పోలీసు బలగాలను మోహరించారు. జాగ్రత్త చర్యగా గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.


.png&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!