

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేతపై వస్తున్న వార్తల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కొన్ని నివేదికల్లో భారత్ వద్ద చమురు నిల్వలు కేవలం 25 రోజులకు మాత్రమే సరిపోతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. దేశంలో ముడి చమురు మరియు రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో దాదాపు 250 మిలియన్ బ్యారెళ్లు, అంటే సుమారు 4 వేల కోట్ల లీటర్ల ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం సరఫరా వ్యవస్థలో ఉన్న చమురు ఉత్పత్తులు దేశ అవసరాలకు దాదాపు రెండు నెలల పాటు సరిపోతాయని కేంద్రం తెలిపింది. భారత్ ప్రస్తుతం 40 దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటోందని, అందులో కేవలం 40 శాతం మాత్రమే హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా వస్తోందని పేర్కొంది. మిగతా 60 శాతం చమురు రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల నుంచి ఇతర మార్గాల ద్వారా భారత్కు చేరుతున్నట్లు తెలిపింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!