
రాజకీయాలు

యష్ కేజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తాజాగా ప్రమోషన్స్‌లో మాట్లాడిన యష్, కేజీయఫ్ 3 తప్పకుండా వస్తుందని చెప్పాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మళ్లీ కలిసి పని చేస్తానని కూడా స్పష్టం చేశాడు. అయితే ప్రస్తుతం ‘టాక్సిక్’, ‘రామాయణ’ సినిమాలతో బిజీగా ఉన్నానని, అవి పూర్తయ్యాకే కొత్త సినిమాలు మొదలు పెడతానని తెలిపాడు.
కేజీయఫ్ 3 కోసం మంచి స్టోరీ, పక్కా స్క్రిప్ట్‌తో వస్తామని యష్ చెప్పాడు. క్వాలిటీ విషయంలో ఎలాంటి కంప్రమైజ్ ఉండదని హామీ ఇచ్చాడు. కేజీయఫ్ 2 తర్వాత ఫ్యాన్స్ మూడో భాగం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అప్డేట్తో వాళ్లు చాలా హ్యాపీగా ఉన్నారు. సరైన సమయంలో ఈ సినిమా భారీ స్థాయిలో వస్తుందని అంచనాలు పెరుగుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!