

హోర్ముజ్ జలసంధి ద్వారా భారత చమురు, గ్యాస్ నౌకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. భారత్-ఇరాన్ దేశాల మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, విద్యా సంబంధాలు ఇంకా బలపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఇరాన్ సుప్రీం లీడర్ మధ్య పలుమార్లు ఫోన్లో మంచి చర్చలు జరిగాయని చెప్పారు.
ఇప్పటి పరిస్థితుల్లో ఇరాన్ యుద్ధం కోరుకోవడం లేదని, కానీ అవసరమైతే తమను తాము రక్షించుకునేందుకు సిద్ధంగా ఉంటామని అబ్దుల్ మజీద్ చెప్పారు. యుద్ధం ఆగాలంటే ఇరుపక్షాలు షరతుల్లేకుండా చర్చలు జరపాలని అన్నారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఎలాంటి షరతులను అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని కూడా ఆయన హెచ్చరించారు.





















.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!