

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను శుక్రవారం కేంద్ర జల సంఘం బృందం సమగ్రంగా పరిశీలించింది.
ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర జల సంఘం డిజైన్స్ & రీసెర్చ్ విభాగం ఎక్స్‌ఆఫిషియో సభ్యుడు ఆదిత్య శర్మ, చీఫ్ ఇంజనీర్ ఎస్.ఎస్. భక్షి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం. రఘురాం ప్రాజెక్ట్ వివిధ విభాగాలను తనిఖీ చేశారు.
వారి పర్యటనలో జలవనరుల శాఖ ENC ఎన్.సి.కె. నరసింహమూర్తి, పోలవరం SE కె. రామచంద్ర రావు, క్వాలిటీ కంట్రోల్ CE కె. శేషుబాబు, DEలైన బాలకృష్ణ, డి. శ్రీనివాస్, ప్రెంచంద్, MEIL జీఎం గంగాధర్, డిజీఎం మురళి ప్రాజెక్ట్ పురోగతిని వివరించారు. పోలవరం వ్యూ పాయింట్ వద్ద నుంచి మొత్తం పనుల దశలను కేంద్ర బృందానికి వివరించారు.
తర్వాత మోడల్ డ్యామ్‌ను సందర్శించిన కేంద్ర బృందానికి అన్ని విభాగాల అధికారులు తాము చూసుకుంటున్న పనుల వివరాలను వివరంగా అందించారు. అనంతరం స్పిల్‌వే, స్పిల్‌వే గేట్లు, గేట్లను నడిపే సిలిండర్లు, పవర్ ప్యాక్‌ల పనితీరును పరిశీలించారు.
అప్‌స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, గ్యాప్–1, డయాఫ్రామ్ వాల్, హైడ్రో పవర్ స్టేషన్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను కూడా వారు పరిశీలించి, ప్రతి చోట అధికారులను అడిగి వివరాలు సేకరించారు.




















కామెంట్స్ (1)
Nice inspection by the team.