

ఈ వీకెండ్ కుటుంబంతో బయటకు వెళ్లాలనుకుంటున్నారా? మెట్రో ప్రయాణం, దేవాలయ దర్శనం, పార్క్ లేదా కోటలు, మ్యూజియంలు సందర్శించాలనుకున్నప్పుడు ఎక్కువగా టికెట్ కోసం క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఎండ కారణంగా లేదా క్యూ లైన్ ఇబ్బందుల వల్ల చాలా మంది తమ ప్లాన్లను మార్చుకుంటున్నారు.
ఇప్పుడు ఆ సమస్యలన్నీ తగ్గాయి. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, కొన్ని నిమిషాల్లోనే మీ ప్రయాణం మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ నుండి మీ టికెట్ యాప్(MEE TICKET APP) డౌన్లోడ్ చేసుకుని, ప్రయాణ టికెట్లతో పాటు సందర్శించే ప్రదేశాల టికెట్లను ఇంటి దగ్గర నుంచే సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని మీ సేవ ద్వారా అందిస్తున్నారు.
బస్, మెట్రో టికెట్లు మొదలుకొని దేవాలయాలు, పార్కులు, మ్యూజియంలు, అటవీ సఫారీ టికెట్లు వరకు అన్నీ ఒకే యాప్ ద్వారా పొందవచ్చు. క్యూలైన్ అవసరం లేకుండా నేరుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. విద్యుత్ కార్ల కోసం సమీప ఛార్జింగ్ కేంద్రాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ యాప్‌కు మంచి ఆదరణ లభిస్తోంది మరియు భవిష్యత్తులో మరిన్ని సేవలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
















.jpg&w=3840&q=75)


4225-1768468351.png&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!