
టెక్నాలజీ

కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ఈ పార్టీ పనిచేస్తుందని, రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశను తీసుకురావడమే లక్ష్యమని ఆమె తెలిపారు.
సింగరేణిపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి తెలంగాణ సంస్కృతిని బలపరిచిందని, బతుకమ్మ పండుగ ద్వారా మన సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేశామని అన్నారు. రాష్ట్రం వచ్చినప్పటికీ తాము కలలు కన్న తెలంగాణ ఇంకా సాధ్యం కాలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘంతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు, త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.


4225-1768468351.png&w=3840&q=75)


















.png&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!