

థాయిల్యాండ్తో కాల్పుల విరమణకు కంబోడియా అంగీకరించింది. గత కొన్ని వారాలుగా ఇరుదేశాల సరిహద్దుల్లో రాకెట్, ఆర్టిలరీ దాడులు, ఫైటర్ జెట్ కార్యకలాపాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిస్థితికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఇరుదేశాల రక్షణ మంత్రులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
జాయింట్ స్టేట్మెంట్ ప్రకారం, సైన్యాన్ని ముందుకు కదిలించకుండా ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే ఉంచేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అదనపు బలగాల మోహరింపు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుందని కంబోడియా రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఒప్పందంపై థాయిల్యాండ్ రక్షణ మంత్రి నథఫోన్ నక్రఫానిట్, కంబోడియా రక్షణ మంత్రి టీ సీహా సంతకాలు చేశారు. సుమారు 20 రోజులుగా కొనసాగిన ఈ ఘర్షణలో ఇప్పటివరకు 101 మంది మరణించగా, రెండు దేశాల్లో కలిపి దాదాపు 5 లక్షల మంది నిరాశ్రయులైనట్లు అంచనా.

.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!