

ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం, మార్కాపురం అనే రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అదే సమయంలో అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూ జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చాలని నిర్ణయించారు. రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి కలపనున్నారు. రాయచోటి నియోజకవర్గం మాత్రం అన్నమయ్య జిల్లాలోనే కొనసాగుతుంది.
ఈ పునర్విభజనలో భాగంగా కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనుండగా, కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండుగా విభజించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి “వాసవీ పెనుగొండ”గా పేరు మారనుంది. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపడంతో పాటు, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చనున్నారు. ఈ మార్పులపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్ విడుదల కానుండగా, జనవరి 1 నుంచి కొత్త పరిపాలన అమల్లోకి రానుంది. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 26 నుంచి 28కు పెరుగనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!