

కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూరు నగరంలో ఒక తెలుగు విద్యార్థిని హత్య చేయబడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆచార్య కళాశాల లో బీబీఏ నాలుగో సంవత్సరం చదువుతున్న దేవశ్రీ (21), చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం బిక్కింవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, జగదాంబ దంపతుల కుమార్తె.
చదువు కోసం బెంగళూరులో అద్దె గదిలో నివసిస్తూ చదువుకుంటున్న దేవ శ్రీ పై, ఆమెకు పరిచయమైన ప్రేమవర్ధన్ అనే యువకుడు దాడి చేసినట్లు మాదనాయనకహళ్లి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పెద్దకొండామర్రికి చెందిన ప్రేమవర్ధన్, ఏదో వ్యక్తిగత వివాదం కారణంగా దేవశ్రీపై దాడి చేసి ఆమె తలపై మోది హత్య చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
హత్య జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపును మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
చదువు పూర్తిచేసుకుని పట్టాతో ఇంటికి వచ్చి కుటుంబంతో ఆనందం పంచుకోవాల్సిన దేవ శ్రీ ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనను కుటుంబ సభ్యులు, స్నేహితులు నమ్మలేక వేదనతో ఏకాంతంలో విలపిస్తున్నారు.


.png&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!