

నేపాల్ మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలీ అరెస్టు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జెన్ జడ్ ఉద్యమ అణచివేత కేసులో ఆయనతో పాటు మాజీ హోంశాఖ మంత్రి రమేశ్ లెఖక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది జరిగిన ఈ ఘటనలో 76 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఓలీ అరెస్టుపై ఆయన పార్టీ సీపీఎన్-యూఎంఎల్ తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపించింది. ఓలీ కూడా తన అరెస్టును కక్షపూరితంగా అభివర్ణిస్తూ, న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. కమిషన్ నివేదికను ఉద్దేశపూర్వకంగా రూపొందించారని పార్టీ నేతలు ఆరోపించారు.
ఇక ఓలీ అరెస్టుకు నిరసనగా ఆయన అనుచరులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల పోలీసులు లాఠీచార్జ్ చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.












.webp&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!