
ఆరోగ్యం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కేంద్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రానికి ఇన్చార్జ్లు, సహ ఇన్చార్జ్లను నియమించింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్గా మహారాష్ట్ర మంత్రి అశిష్ సెలార్ను నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది.
అదే విధంగా సహ ఇన్చార్జ్లుగా రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, ఎంపీ రేఖ శర్మలకు బాధ్యతలు అప్పగించింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలంగా పోటీ చేయాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో ఎన్నికల వ్యూహం, కార్యాచరణపై ఈ ఇన్చార్జ్లు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!