
బిజినెస్

మదాలస – స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భావరస నాట్యోత్సవం – సీజన్ 1’ ఆదివారం హైదరాబాద్లోని ఫీనిక్స్ అరేనాలో అంగరంగ వైభవంగా జరిగింది. భరతనాట్యం, మోహినియాట్టం వంటి శాస్త్రీయ నృత్యరూపాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫీనిక్స్ గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
కేరళకు చెందిన మంజు వి. నాయర్, బెంగళూరుకు చెందిన స్వప్న రాజేంద్రకుమార్ , అలాగే హైదరాబాద్కు చెందిన సౌజన్య శ్రీనివాస్ తమ అద్భుత నృత్యప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. గణేశ కృతి నుంచి ఆదిశంకరాచార్య, త్యాగరాజ స్వరపరిచిన కృతుల వరకు సాగిన ఈ నృత్యోత్సవం రెండు గంటల పాటు శాస్త్రీయ కళా వైభవానికి అద్దం పట్టింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!