

ఢాకా: బంగ్లాదేశ్ అన్ని మతాలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు సొంతం అని, ఈ దేశంలో ప్రతి మనిషికి స్థానం ఉన్నదని మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రహ్మాన్ స్పష్టం చేశారు. ప్రజలు శాంతిగా ఉండాలన్న మరియు సమ్మిళిత సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ఆయనకు ఒక విజన్ ఉందని ఆయన అన్నారు. 17 ఏళ్ల తర్వాత తారిఖ్ తన కుటుంబంతో కలిసి బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే ఆయన చెప్పులు లేకుండా అడుగుపెట్టి నేలను ముద్దాడారు.
60 ఏళ్ల తారిఖ్, గత కొన్ని సంవత్సరాలు లండన్‌లో ఉంటూ బీఎన్పీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పదవికి ఆయన కీలక పోటీదారుగా భావిస్తున్నారు. విమానాశ్రయం నుండి నేరుగా జులై 36 ఎక్స్‌ప్రెస్‌వేలో ఏర్పాటు చేసిన పార్టీ సభకు వెళ్లి, వేలాది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. సభలో ఆయన 1971లో స్వాతంత్య్రం సాధించినట్లు, 2024 జులైలో మరోసారి స్వాతంత్య్రాన్ని సాధించామని, మెరుగైన బంగ్లాదేశ్ నిర్మించేందుకు బీఎన్పీ కృషి చేస్తుందని చెప్పారు.
సభ ముగిసిన తర్వాత తారిఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి ఖాలిదా జియాను పరామర్శించారు. ప్రసంగంలో ఆయన దేశాన్ని అన్ని వర్గాల ప్రజల కోసం శాంతియుత, సమ్మిళిత సమాజంగా మార్చే తన లక్ష్యాన్ని కూడా పంచుకున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!