

హైదరాబాద్ కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్లో విషాద ఘటన జరిగింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూస్తున్న సమయంలో ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ ఘటనతో థియేటర్లో విషాద వాతావరణం నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం, సినిమా మధ్యలో ఆనంద్ కుమార్ ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుర్చీలోనే కుప్పకూలిపోయారు. వెంటనే థియేటర్ సిబ్బంది స్పందించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు అనుమానించారు.
ఆనంద్ కుమార్ గతంలో 12 వ బెటాలియన్లో ASI గా పనిచేసి రిటైర్ అయ్యారని తెలుస్తోంది. గుండెపోటే మృతికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఖచ్చితమైన కారణం పోస్ట్మార్టం నివేదిక తర్వాతే వెల్లడవుతుందని తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!