
ఓటిటి

హనుమాన్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడు బలం, జ్ఞానం, వాక్చాతుర్యం కలిగిన అరుదైన వ్యక్తిత్వమని ఆయన పేర్కొన్నారు. సంత్ తులసీదాస్ రామచరితమానస్‌లో చెప్పినట్లుగా హనుమంతుడు జ్ఞానుల్లో అగ్రగణ్యుడని అన్నారు. హిందూ పురాణాల్లో ఆయనను సంపూర్ణ గుణాల సమాహారంగా కీర్తిస్తారని వివరించారు.
వాల్మీకి రామాయణంలో చెప్పినట్లుగా హనుమంతుడు దోషరహితమైన భాష, స్పష్టమైన ఉచ్చారణ, వ్యాకరణంపై పట్టు కలిగిన గొప్ప వక్త అని కేసీఆర్ కొనియాడారు. ధర్మరక్షణ కోసం శ్రీరాముడికి అంకితభావంతో పనిచేసిన హనుమంతుడు వినయం, శక్తి, సేవాస్ఫూర్తికి ప్రతీకగా నిలిచారని అన్నారు. యువత హనుమంతుడి ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని, రాష్ట్రం అభివృద్ధి చెందుతూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.











.avif&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!