
క్రీడలు

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన రాకాస సినిమా ఈ నెల 3 న గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేమ, యాక్షన్, కామెడీ, ఫాంటసీ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించగా మానస శర్మ దర్శకత్వం వహించారు. నిర్మాత, దర్శకురాలు ఇద్దరూ మహిళలు కావడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సుమారు 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించినట్లు తెలుస్తోంది. థియేటర్ విడుదల తర్వాత 4 నుంచి 8 వారాల్లో ఓటీటీలో విడుదల చేసే ఒప్పందం మేరకు నెట్‌ఫ్లిక్స్‌తో డీల్ కుదిరింది. ఈ నేపథ్యంలో రాకాస సినిమా ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల రెండో వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే థియేటర్ రన్‌పై ఆధారపడి స్ట్రీమింగ్ తేదీలో మార్పులు ఉండొచ్చు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!