
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల కావడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026 కు ఆమోదం తెలిపినందుకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన ఈ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఈ నెల 1, 2 తేదీల్లో ఆమోదించిన విషయం తెలిసిందే.
అమరావతి రాజధానిగా చట్టపరమైన గుర్తింపు పొందడం రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరినట్టేనని సీఎం పేర్కొన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయం అని ఆయన అన్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!